: నా దుస్తుల గురించి నీకెందుకు?.. నీ పని నువ్వు చూసుకోవోయ్!: నెటిజన్‌పై యాంకర్ అనసూయ ఆగ్రహం
టీవీ షోల్లో బిజీబిజీగా ఉంటున్న యాంకర్ అనసూయ తాజాగా ఓ నెటిజన్‌పై మండిపడింది. అనసూయ ధరిస్తున్న దుస్తులు అభ్యంతరకరమని ఓ నెటిజన్ పేర్కొనడంతో అతడికి క్లాస్ పీకింది. తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. దానిపై స్పందించిన ఓ నెటిజన్.. అనసూయకు ఏమైనా సెన్స్ ఉందా? అని కామెంట్ చేశాడు. ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి? అని నిలదీశాడు. కుటుంబంతో కలిసి తాము టీవీ కార్యక్రమాలు చూడలేకపోతున్నామని పేర్కొన్నాడు. ఆ కామెంట్ చూసిన అనసూయకు చిర్రెత్తుకొచ్చింది.
'అలాగైతే ఆ ప్రోగ్రాంలను చూడకు అంటూ సలహా ఇచ్చింది. కుటుంబ విలువలపై అంతగా పట్టింపు ఉన్న వ్యక్తి ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదని హితవుపలికింది. ఇతరులు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో ఇలా చెప్పకూడదని పేర్కొంది. ఒక మహిళ, అమ్మ, భార్య అయిన తనలాంటి పబ్లిక్ ఫిగర్‌తో మాట్లాడే స్వేచ్ఛను తీసుకోవద్దని ఘాటుగా క్లాస్ పీకింది. తాను ఏ దుస్తులు వేసుకోవాలో తనకు తెలుసని, మనుషులు ఏం చూడాలనుకుంటే అదే చూస్తారని తెలిపింది.
చిన్నారులపై లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయని, 65 ఏళ్ల వృద్ధ మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని అనసూయ ప్రశ్నించింది. వారేం ఎక్స్‌పోజింగ్ చెయ్యరు కదా? అని నిలదీసింది. ఇతరులకు ఇటువంటి సూచనలు చేయొద్దని, 'నీ పని నువ్వు చూసుకో' అని మెత్తగా చురక అంటించింది.