: 2008 మాలేగావ్ పేలుడు కేసు నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చుతూ 2008 మాలేగావ్ పేలుడు కేసులో నిందితుడిగా 9 ఏళ్ల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేక షరతులతో ఈ బెయిల్ మంజూరు చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మాలేగావ్ పేలుళ్లతో సంబంధమున్న వర్గంలోని వ్యక్తిని కలిసినట్లు అంగీకరించి, రాజకీయ ఒత్తిడుల కారణంగా శ్రీకాంత్ ప్రసాద్ పోలీసులకు లొంగిపోయారు. అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు జైలులో తాను దైన్య జీవితం గడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిలటరీలో తన క్లయింట్ అందించిన సేవలను గుర్తించకుండా, వాటిని ఉపయోగించుకోకుండా అతన్ని జైలులో ఉంచారని శ్రీకాంత్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు.