: పూరీ జగన్నాథ్ నన్ను కలవడంపై సందేహాలు అక్కర్లేదు: విక్రంగౌడ్


ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనకు చాలా సన్నిహిత మిత్రుడని, అందుకే ఆస్పత్రిలో ఉన్న తనను చూసేందుకు వచ్చారని, ఈ విషయంలో సందేహాలు అక్కర్లేదని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ తేల్చి చెప్పారు. విక్రంగౌడ్ ఇటీవల కాల్పుల కలకలం కేసులో గాయాలతో ఆస్పత్రి పాలై, తర్వాత అరెస్టయి బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

అనంతరం ఓ చానల్ తో విక్రంగౌడ్ మాట్లాడుతూ... డ్రగ్స్ తో  తనకు ఎటువంటి సంబంధం లేదని, పూరీ జగన్నాథ్ తనను కలవడాన్ని, దీంతో ముడిపెట్టి చూడరాదన్నాడు. కావాలంటే తన నుంచి నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుకోవచ్చని సవాల్ చేశాడు. తనకు ఎటువంటి పబ్ లేదని ఆయన స్పష్టం చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ ఉండగా, అది మూతపడిందన్నారు. అలాగే, నాగార్జున సెంటర్ లో ఓ రెస్టారెంట్ ఉందని, అక్కడ అన్నం తినేందుకు వచ్చే వారికి, డ్రగ్స్ తో సంబంధం లేదన్నారు.

  • Loading...

More Telugu News