: మామయ్య చిరంజీవికి ఉపాసన చేసిన ప్రామిస్!
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కోడలు ఉపాసన కామినేని ఆయనకు ఓ ప్రామిస్ చేశారు. చిరంజీవి తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి రామ్ చరణ్ అని, అతనితో పాటు కుటుంబాన్నంతటినీ ఎల్లవేళలా సంతోషంగా ఉంచడానికి తాను ప్రయత్నిస్తానని మామయ్యకు ప్రామిస్ చేసినట్లు ఉపాసన తెలిపారు. ఈ ప్రామిస్‌ను నిలుపుకోవడం ఒక అందమైన బాధ్యత అని ఆమె అన్నారు.
చిరంజీవికి తానంటే ఎంతో నమ్మకమని, తాను చేసిన ప్రతి పనిని ఆయన పొగడుతారని, ఇంకా బాగా చేయాలని ప్రోత్సహిస్తారని ఉపాసన చెప్పుకొచ్చారు. అలాగే రామ్ చరణ్‌కి కూడా నాన్నంటే ఎంతో ప్రేమ అని, చిరంజీవి మాస్టర్ అయితే చరణ్ స్టార్ శిష్యుడని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి 150వ సినిమా తమ కుటుంబ సభ్యులందరికీ ఎమోషనల్‌గా బాగా కనెక్టయిన చిత్రమని ఉపాసన చెప్పారు.