: భారత్‌పై ఆరోపణలు చేస్తూ.. చైనా మీడియా మరో వీడియో!
భారత్ చేసిన ఏడు పాపాలు అంటూ ఇటీవలే ఓ వీడియోను ప్రసారం చేసిన చైనా మీడియా 'జిన్హుహా' తాజాగా మరో వీడియో ప్రసారం చేసింది. భారత్‌ను పొగుడుతున్నట్లు మొదట చూపించి, ఆ తరువాత ఎప్పటిలాగే భారత్‌పై ఆరోపణలు చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న డోక్లాం వివాదానికి కారణం ఇండియానేనని వార్తలు ప్రసారం చేసింది. ఈ వీడియోలో మొదట భారత్ ప్రపంచంలోనే పురాతన నాగరికత గల దేశమని ఆ మీడియా చూపించింది. అద్భుతమైన సంస్కృతి భారత్ సొంతమని అంది. అనంతరం డోక్లాం తమ దేశ భూభాగమేనని చెప్పుకుంది.
భారత్ చైనా భూభాగంలోకి ప్రవేశించిందని ఆ వీడియో పేర్కొంది. తమ దేశానికి చెందిన ఆర్మీ మాత్రం సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపింది. గత రెండు నెలలుగా డోక్లాంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇలా చైనా మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తూనే ఉన్నాయి.