: వంద కోట్ల క్లబ్ లో చేరిన 'టాయిలెట్'!


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పట్టిందల్లా బంగారమే అన్నట్టు మారింది. 'రుస్తుం', 'ఎయిర్ లిఫ్ట్', 'జానీ ఎల్ఎల్బీ' సినిమాలు వరుసగా హిట్లుగా నిలిచాయి. తాజాగా విడుదలైన ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ సినిమా కూడా విజయవంతమైంది. సామాజిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా, వంద కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఆగస్టు 11న విడుదలైన ఆ సినిమా కేవలం తొమ్మిది రోజుల్లోనే 106.8 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపును కూడా ఇచ్చింది.

 బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్ నటించిన 'జబ్ హ్యారీ మెట్ సెజెల్', సల్మాన్ ఖాన్ నటించిన 'ట్యూబ్ లైట్' సినిమాలు ఘోరపరాజయం చవిచూడగా, అక్షయ్ కుమార్ మాత్రం పరాజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథాంశాలతో విజయవంతంగా ముందుకెళ్తున్నాడు. 

  • Loading...

More Telugu News