: నోటిదురుసుతో కష్టాల్లో గంభీర్
మంచి క్రికెటరే. కానీ ఏం లాభం ప్రవర్తనే చెడ్డది. మనిషి చూస్తే ఎప్పుడు గంభీరమే. చిరునవ్వు వెతికినా కనిపించదు. క్రిజ్ లో ఎవరేమన్నా.. నోటికి పని చెబుతాడు. మొన్న విరాట్ కోహ్లీ, నిన్న ద్రవిడ్ ను మాటలతో పొడిచేశాడు. వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎంతవేచి చూసినా క్రికెటర్ గౌతం గంభీర్ లో మార్పు రావడం లేదు. ఇక సెలక్టర్లు గంభీర్ విషయంలో తామే మారాలనుకున్నారు. ఇప్పటికే టెస్టులకు దూరం పెట్టిన గంభీర్ ను తాజాగా ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలోనూ ఎంపిక చేయకుండా వన్డేలకూ గంభీర్ ను దూరం పెట్టేశారు. ఇకనైనా గంభీర్ లో ఆ నోటిదురుసు పోతుందేమో చూడాలి.