: ఆగస్టు 15న స్కూలుకు రాలేదని విద్యార్థులకు రూ.2500 చొప్పున ఫైన్!
స్కూల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలకు హాజరు కాని విద్యార్థులకు పెద్దమొత్తంలో జరిమానా విధించిందో స్కూల్. చెన్నైలోని పురసైవాక్కంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో జరిగిందీ ఘటన. ఆగస్టు 15న పలువురు విద్యార్థులు స్కూలుకు రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన స్కూలు యాజమాన్యం వారికి భారీ జరిమానాలు విధించింది. మొత్తం 19 మంది విద్యార్థులను గుర్తించి ఒక్కొక్కరికీ రూ.2500 చొప్పున ఫైన్ వేసింది. అంతేకాదు.. ఆ మొత్తం చెల్లించే వరకు స్కూలుకు రావద్దంటూ హుకుం జారీ చేసింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. స్కూలు నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సహా పలువురు తప్పుపడుతున్నారు.