: నీ ఇంట్లో 500,1000 నోట్లు దొరికాయట.. నీకు ఐదు నిమిషాల టైమ్.. బ్యాగు సర్దుకో!: 'బిగ్ బాస్'లో నవదీప్ ను ఆటపట్టించిన జూనియర్ ఎన్టీఆర్


బిగ్ బాస్ రియాలిటీ షోలో వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్, కంటెస్టెంట్ నవదీప్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...నిన్నటి ఎంపిసోడ్ ఎలిమినేషన్ స్పెషల్ కావడంతో... 'నవదీప్ మీ ఇంట్లో 500, 1000 రూపాయల పాత నోట్లు దొరికాయట... నిన్ను విచారణకు రమ్మంటున్నారు. ఐదు నిమిషాల టైమ్ ఇస్తున్నాను, వెంటనే బయటకు రా' అంటూ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్, నవదీప్ ను ఆటపట్టించాడు.

దీంతో అది నిజమేనని నమ్మిన నవదీప్ తన బ్యాగేజ్ సర్దుకునేందుకు వెళ్లగా, 'వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన నువ్వు 'కొత్త వెయ్యి నోట్లు వచ్చాయంటూ' అందర్నీ ఆటపట్టించగా లేనిది మేము నిన్ను ఆటపట్టించలేమా?' అన్నాడు. దీంతో అందరూ నవ్వేశారు. 

  • Loading...

More Telugu News