: సూర్యగ్రహణం హైదరాబాదులో కనిపించే అవకాశం లేదు!: బిర్లా సైన్స్ సెంటర్
నేటి ఉదయం సంభవించే సూర్య గ్రహణం హైదరాబాదులో కనిపించే అవకాశం లేదని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయం ప్రకారం అమావాస్య రోజైన నేటి ఉదయం 9:30 నిమిషాలకు సూర్య గ్రహణం సంభవించనుంది. దీనిని వీక్షించేందుకు పలుదేశాల ప్రజలు ఏర్పాట్లు చేసుకోగా, దీనిపై పరిశోధించేందుకు నాసా ప్రత్యేకంగా విమానాన్ని పంపి పరిశోధనలు నిర్వహించనుంది. ఈ సూర్య గ్రహణాన్ని వీక్షించేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇది హైదరాబాదీలకు కనిపించదని, అమెరికాలో మాత్రం దీనిని అందరూ వీక్షించవచ్చని తెలిపింది.