: తొలి వన్డే లో టీమిండియా ఘన విజయం..శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో గెలుపు
దంబుల్లాలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. కేవలం 28.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయిన భారత జట్టు 220 పరుగులు సాధించి, ఘన విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ బరిలోకి దిగినప్పటికీ వారి భాగస్వామ్యం ఎక్కువసేపు కొనసాగలేదు. రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ కోహ్లీ, ధావన్ తో జతకట్టి నిలకడగా రాణించాడు. వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫోర్లు, సిక్స్ లు బాదుతూ లంక బౌలర్లకు దిమ్మతిరిగేలా చేశారు. ఈ విఅజయంతో ఐదు వన్డేల సిరీస్ లో భారత్ కు 1-0 అధిక్యం లభించింది.
భారత్ బ్యాటింగ్: రోహిత్ శర్మ (4), ధావన్ 132, కోహ్లీ 70 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
భారత్ స్కోర్ :220/1
శ్రీలంక స్కోర్: 216 ఆలౌట్