: వైసీపీపై ఈసీకు మరోమారు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు


నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తీరుపై టీడీపీ మరోమారు ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదు చేసింది. ప్రజలను, ఈసీని తప్పుదోవ పట్టించేలా వైసీపీ వ్యవహరిస్తోందంటూ రాష్ట్ర ఈసీ ప్రధాన అధికారి భన్వర్ లాల్ ను కలిసిన టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని ఫిర్యాదు చేశారు.

 అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కొనకళ్ల డిమాండ్ చేశారు. డబ్బులు తరలిస్తున్నారంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన వైసీపీపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. నంద్యాలలో హింసను రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని నాని అన్నారు. 

  • Loading...

More Telugu News