: ఆ ధైర్యం మా తల్లిదండ్రుల నుంచి వచ్చిందే: భూమా మౌనిక


ధైర్యంగా మాట్లాడే లక్షణం తమ తల్లిదండ్రుల నుంచి తమకు వచ్చిందని ఏపీ మంత్రి అఖిలప్రియ సోదరి భూమా మౌనిక అన్నారు. ఓ న్యూస్  ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా వున్నది ప్రజలేనని, ఈ రోజు కూడా తాము ఇంత ధైర్యంగా మాట్లాడగలగడానికి ప్రజల మద్దతు ఉండటమే కారణమని చెప్పారు. ప్రజలతో కలిసి ఉండటమనేది తమకు చిన్నప్పటి నుంచి అలవాటేనని, ప్రజల కోసం తాము పనిచేస్తూనే ఉంటామని చెప్పారు. పదవులు ఉంటేనే పనిచేస్తామనే ఆలోచనా ధోరణి తమకు లేదని, ప్రజలకు సేవ చేయడమనేది తమ లక్ష్యమని మౌనిక అన్నారు. తన తండ్రి రాజకీయ పునాదులు వేశారని, దానిని ఆధారంగా చేసుకుని కేడర్ ను మరింత బలంగా చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News