: 200 పరుగులు పూర్తి చేసిన శ్రీలంక
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక జట్టు 200 పరుగులు పూర్తి చేసింది. మలింగా కొట్టిన బౌండరీతో శ్రీలంక స్కోరు 204 పరుగులకు చేరింది. అయితే, ఆ తర్వాత కొంచెం సేపటికి చాహల్ వేసిన బంతిని కొట్టబోయిన మలింగా కీపర్ ధోనీ చేతిలో ఔటయ్యాడు. ప్రస్తుతం మ్యాథ్యూస్, ఫెర్నాండో భాగస్వామ్యం కొనసాగుతోంది. శ్రీలంక స్కోరు 41.2 ఓవర్లలో 209/9. ఒక దశలో శ్రీలంక వికెట్లు వెంటవెంటనే పడిపోయినప్పటికీ గౌరవప్రదమైన స్కోరు చేస్తున్నారు.