: కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బాధిత హీరోయిన్ ఆరోపణలు!


సినిమా షూటింగుకి వెళదామంటూ తీసుకెళ్లి వర్ధమాన నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ దర్శకుడు చలపతి, హీరో స్టీఫెన్ కు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితురాలు ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విజయవాడ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. తనపై అసభ్యంగా ప్రవర్తించిన సృజన్ ను వదిలేసి, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారని ఆరోపించింది.

 ఈ కేసు నుంచి  సృజన్ ను తప్పించేందుకు అరెస్ట్ చేసిన వ్యక్తికి ముసుగు కట్టి జైలుకు తరలించారని, సృజన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె వాపోయింది. డబ్బుల కోసమే కేసు పెట్టిందంటూ సృజన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణలను బాధితురాలు ఖండించింది. తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరింది.

  • Loading...

More Telugu News