: దయచేసి సెట్ లో దిగిన ఫొటోలను లీక్ చేయొద్దు: అభిమానులకు త్రిష విజ్ఞప్తి
ప్రేమ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘96’. ఈ సినిమా సెట్లో తీసిన ఫొటోలు లీకై, సామాజిక మాధ్యమాలకు చేరడంపై త్రిష స్పందించింది. సినిమా సెట్ లో అభిమానులతో ఫొటోలు దిగేందుకు ఆలోచించనని, అయితే, షూటింగ్ లో, సెట్ లో తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచవద్దని కోరింది. ఎందుకంటే, ఆ ఫొటోలను ఓ సమయంలో విడుదల చేయాలని దర్శకుడి భావిస్తారని, అంతకంటే ముందుగానే, ఆ ఫొటోలను అభిమానులు బయటపెట్టడం కరెక్టు కాదని, దర్శకుడిని అగౌరవపరచడమే అవుతుందని తన ట్వీట్ లో త్రిష పేర్కొంది.