: 20 వేలకు పైగా మెజార్టీతో టీడీపీ గెలవబోతోంది: టీడీపీ నేత అమర్ నాథ్ రెడ్డి
నంద్యాల ఉపఎన్నికలో 20 వేలకు పైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలవనున్నారని ఆ పార్టీ నేత అమర్ నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా చెప్పారు. ‘అంత మెజార్టీతో గెలుస్తారని ఎలా చెప్పుగలుగుతున్నారు? సర్వే ఏమైనా చేయించారా?’ అని ప్రశ్నించగా, సర్వేలు అవసరం లేదని, ప్రతిరోజూ ప్రజల్లో తిరుగుతున్నామని, తాము తిరగడమే తమ సర్వే అని అన్నారు.
దాదాపు రెండు నెలల నుంచి ఈ ప్రాంతంలో అన్ని గ్రామాల్లో తిరిగామని, నంద్యాల నియోజకవర్గ ప్రజల నాడి తమకు తెలిసిపోయిందని, ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి ప్రతి రాజకీయనాయకుడికి ఉండాలని, ఉంటేనే రాజకీయాల్లో ఉండాలని అన్నారు.