: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా!
దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఓపెనర్లు గుణ తిలకా, డిక్ వెల్లా క్రీజ్ లో ఉన్నారు. శ్రీలంక స్కోరు 6.3 ఓవర్లలో 29 పరుగులుగా ఉంది. కాగా, ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు టెస్టు సిరీస్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక జట్టు ఉవ్విళ్లూరుతోంది.