: గెలుపు ఖాయం.. మెజారిటీ ఎంతన్నది ఇప్పుడే చెప్పలేను!: వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాల ఉపఎన్నికలో తన గెలుపు ఖాయమని వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, వైసీపీకి ప్రజల్లో మంచి స్పందన వస్తోందని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని, అయితే, ఎంత మెజారిటీతో విజయం సాధిస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. కాగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు నిన్న మద్దతు ప్రకటించారు. తాజాగా అక్కినేని అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. శిల్పా మోహన్‌రెడ్డికి ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ రామరాజు ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.