: మొన్న ఘట్టమనేని, నేడు అక్కినేని... శిల్పాకు నాగార్జున ఫ్యాన్స్ మద్దతు!


నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి గత వారంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు పలకగా, నేడు అక్కినేని నాగార్జున అభిమానులు మద్దతు పలికారు. ఎన్నికల్లో తాము శిల్పాకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామరాజు తెలిపారు. నాగ్ అభిమానులంతా శిల్పాకు ఓటు వేయాలని, ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా, శిల్పాకు సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేశ్‌ బాబు అభిమానులు మద్దతు ఇస్తారని నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే

  • Loading...

More Telugu News