: రూ. 5 వేల వరకూ తగ్గిన శాంసంగ్ పాప్యులర్ ఫోన్ల ధర!
మిడ్ రేంజ్ లో తాము అందిస్తున్న పాప్యులర్ ఫోన్లు ఏ5, ఏ7 ధరలను రూ. 5 వేల వరకూ తగ్గిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన గెలాక్సీ ఏ5 వేరియంట్ ధరను రూ. 26,999 నుంచి రూ. 22,900కు గెలాక్సీ ఏ7 ధరను రూ. 30,900 నుంచి రూ. 25,900కు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఇండియాలో పండగ సీజన్ అమ్మకాలపై ప్రత్యేక దృష్టిని పెట్టామని, ధరల తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నట్టు తెలిపింది.
కాగా, మార్చిలో మార్కెట్లోకి వచ్చిన వేళ ఏ5 ధర రూ. 28,990 కాగా, ఏ7 ధర రూ. 33,490గా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్లలో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సి పోర్టు, 1.9 జీహెచ్ ఆక్టా కోర్ ఎస్ఓసీ ప్రాసెసర్ తదితరాలు కామన్ కాగా, ఏ5 5.2 అంగుళాలు, ఏ7 5.7 అంగుళాల స్క్రీన్ తో లభిస్తాయి.