: ఫైవ్-స్టార్ హోటళ్లలో బసకు చెక్ చెప్పండి.. మంత్రులకు మోదీ క్లాస్!


ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. మంత్రులు ఇక నుంచి ఫైవ్-సార్ట్ హోటళ్ల బసను మానుకోవాలని, అలాగే వారివారి మంత్రిత్వ శాఖాల ద్వారా అందే లబ్ధి నుంచి దూరంగా ఉండాలని కోరారు. ఆయా మంత్రిత్వ శాఖలకు అనుసంధానమై ఉన్న సంస్థల కార్లను కూడా వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించవద్దని సూచించారు. ప్రభుత్వం భరిస్తోందన్న కారణంతో చాలామంది మంత్రులు ఫైవ్-స్టార్ హోటళ్లలో బస చేస్తుండడం తనను తీవ్రంగా బాధిస్తోందన్నారు.

కొందరు మంత్రులు కార్యాలయాల నుంచి కూడా లబ్ధి పొందుతుండడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వాహనాలను ఉపయోగించరాదని ఈ సందర్భంగా మంత్రులకు సూచించారు. అలాగే వ్యక్తిగత సిబ్బందిని కూడా తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవద్దని ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తమ ప్రభుత్వంపై అవినీతి మచ్చ ఉండకూడదని భావిస్తున్న ప్రధాని ఇటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News