: ఈ చిన్నారి వీడియో వైరల్.. కోహ్లీ సహా పలువురు ఆగ్రహం!.. మీరూ చూడండి


దేశవ్యాప్తంగా ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. చిన్నారితో గణితం లెక్కలు చేయిస్తున్న తల్లి వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమవుతోంది. చిన్నారిని తిడుతూ, కొడుతూ లెక్కలు చేయించిన ఆమెపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వీడియోపై మొట్టమొదట స్పందించింది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. చిన్నారిపై తల్లి వ్యవహరించిన తీరు తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని, బెదిరించి నేర్పించాలనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను కోహ్లీ పోస్ట్ చేసిన కాసేపటికే అతడిని ఫాలో అవుతున్న 15.1 లక్షల మందిలో 10.9 లక్షల మంది చూశారు.

ఇక ఈ వీడియోలో ఐదేళ్లు ఉండే ఓ చిన్నారి బెడ్‌పై నోట్‌బుక్ పట్టుకుని అంకెలు చదవడం నేర్చుకుంటోంది. ఎదురుగా తల్లి ఆమెను తిడుతూ, కొడుతూ ఆమెతో అంకెలు సరిగ్గా చెప్పించే ప్రయత్నం చేస్తోంది. చిన్నారి కంటి నుంచి ధారాళంగా నీళ్లు కారుతూ అంకెలు చెబుతుండడం నెటిజన్ల గుండెలు పిండేస్తోంది. ఈ క్రమంలో తల్లి చెప్పిన దానికి కోపంగా పళ్లు కొరుకుతూ అంకెలు చెబుతున్న చిన్నారిని చూస్తే జాలి కలుగుతుంది. ఆ తల్లి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News