: మిగిలింది ఏడాదిన్నరే... చంద్రబాబు నోటి నుంచి 'ముందస్తు' సంకేతం!


2019 ఏప్రిల్ తరువాత జరగాల్సిన ఎన్నికలు వచ్చే సంవత్సరం డిసెంబర్ లోనే జరగనున్నాయా? నంద్యాలలో చంద్రబాబు ప్రసంగాన్ని విన్న వారికి అవుననే అనిపిస్తోంది. నంద్యాల ఎన్నిక కేవలం ఏడాదిన్నర కోసమేనని, 2018 డిసెంబర్ లోనే ఎన్నికలు రావచ్చని ఆయన వెల్లడించారు. మోదీ సర్కారు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకే దఫా జరిపించే విధంగా అడుగులేస్తున్న వేళ, చంద్రబాబు కూడా ఆ ఆలోచనను బలపరుస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నోటి నుంచి ముందస్తు ఎన్నికల మాట వినిపించడంతో, మోదీ కోరిక నెరవేరేట్టుగానే కనిపిస్తోందని రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News