: ఆయన ఈల వేస్తే.. వందలాది కోళ్లు గాల్లో ఎగురుకుంటూ వస్తాయి... వీడియో చూడండి!


ఓ కొండ‌పై వంద‌లాది కోళ్లు ఉన్నాయి.. ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి. ఇంత‌లో ఓ వ్య‌క్తి ఈల వేశాడు. అంతే, ఎక్క‌డెక్క‌డో ఉన్న ఆ కోళ్లంతా ఎంతో హుషారుగా ఎగురుకుంటూ ఆయ‌న వైపుగా వెళ్లిపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. చైనాలోని గిఝౌవ్‌ రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ రైతు ఈ పెంపుడు కోళ్ల కోసం తిండి గింజలు తీసుకొని, ఇలా విజిల్ వేశాడు. ఆ కోళ్లంతా గుంపులు గుంపులుగా పైకి ఎగురుతూ వ‌చ్చి వాటిని తినేశాయి. కోళ్లు కూడా ఇంత పైకి ఎగర‌గ‌ల‌వా? అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  

  • Loading...

More Telugu News