: నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో జనసేన సైనికుల ఎంపికకు పవన్ కల్యాణ్ ప్రకటన
రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న మేధావులు, యువత కోసం జనసేన ఆహ్వానం పలుకుతోందని, తాము నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వారి ఎంపిక కోసం శిబిరాలు నిర్వహించనున్నామని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయా జిల్లాల్లోని ఔత్సాహికులు స్పీకర్లు, అనలిస్టులు, కంటెంట్ రైటర్స్ విభాగాల్లో ఎంపికల ప్రక్రియలో పాల్గొనవచ్చని తెలిపారు. నిజామాబాద్‌లోని కంటేశ్వర్ సమీపంలోని శ్రావ్య గార్డెన్స్ లో ఈ నెల 23న, ఖమ్మంలోని బైపాస్ రోడ్డు సమీపంలోని ఎం.బి గార్డెన్స్ దగ్గర వచ్చేనెల 7న ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు.