: ఖతౌలి వద్ద పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. ఐదుగురి మృతి, 30 మందికి పైగా గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పూరీ-హరిద్వార్-కళింగ ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పడంతో అందులోని ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.