: ప్రైవేట్ పాఠశాల హాస్టల్ లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య


కర్నూలు నగర సమీపంలోని దిన్నెదేవరపాడు గ్రామ పరిధిలోని కట్టమంచి ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు పాఠ‌శాల‌కు వెళ్లకుండా హాస్ట‌ల్‌లోనే ఉండిపోయిన ఆమె... అక్క‌డే ఫ్యానుకి ఉరి వేసుకుని ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని, అయితే అప్ప‌టికే ప్రీతి ప్రాణాలు కోల్పోయింద‌ని వైద్యులు చెప్పార‌ని హాస్ట‌ల్ సిబ్బంది తెలిపారు.

ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగింది. అదే స‌మ‌యంలో క‌ర్నూలు జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆసుపత్రి వద్దకు వ‌చ్చారు. ఆయ‌న‌పై మృతురాలి బంధువులు దాడి చేసి, ఆయ‌న కారుని ధ్వంసం చేశారు. త‌రువాత మృత‌దేహంతో క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌కు వెళ్లి నిర‌స‌న తెలిపారు. స‌ద‌రు విద్యార్థిని ప్రీతి కర్నూలులోని చాణిక్యపురి కాలనీలో నివాసం ఉంటున్న రాజునాయక్‌, పార్వతీ బాయిల కుమార్తె.  

  • Loading...

More Telugu News