: త్వ‌ర‌లో ఇందిరా పాఠ‌శాల‌లు.. క‌ర్ణాట‌క ప్రభుత్వ ప్ర‌య‌త్నం!


క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, వెన‌క‌బ‌డిన తరగతుల విద్యార్థుల కోసం త్వ‌ర‌లో `ఇందిరా పాఠ‌శాల‌లు` పేరుతో 100 స్కూళ్ల‌ను ఆవిష్క‌రించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. మొరార్జీ దేశాయ్‌, కిత్తూర్ రాణి చెన్న‌మ్మ పేర్ల మీద 278 రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని చేబట్టాలని 2016-17 బడ్జెట్టులో నిధులు మంజూరు చేశారు. వీటిలో ప్రారంభం కావలసిన 100 స్కూళ్ల‌కు ఇందిరాగాంధీ పేరు పెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే మొరార్జీ దేశాయ్ పేరుతో ఉన్న పాఠ‌శాల‌ల పేరు మార్చ‌కుండా త్వ‌ర‌లో ఆవిష్కరించ‌బోయే వంద స్కూళ్ల‌కు మాత్ర‌మే ఇందిరాగాంధీ పేరు పెడుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌లే `ఇందిరా క్యాంటీన్‌` పేరుతో త‌క్కువ రేటుకు ఆహార ప‌థ‌కం ప్రవేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News