: శత్రు సంహార హోమం నిర్వహిస్తున్న దినకరన్.. విరుచుకుపడ్డ పళని వర్గీయులు!
శశికళ బంధువు దినకరన్ శత్రు సంహార హోమాన్ని నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని శివగంగై జిల్లా పెరమాలై ఆలయంలో ఆయన ఈ హోమాన్ని చేస్తున్నారు. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శశికళను కలిసినప్పుడు, హోమం నిర్వహించాలని ఆమె సూచించినట్టు తెలుస్తోంది. దినకరన్ చేస్తున్న శత్రు సంహార హోమం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, దినకరన్ హోమంపై పళనిస్వామి వర్గీయులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తన గుప్పిట్లో ఉండాలనే కోరికతోనే హోమం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పళనిస్వామి ప్రభుత్వం కూలిపోవాలనేదే వారి లక్ష్యమని ఆరోపించారు. న్యాయం, ధర్మం ఉన్నవారి వైపే దేవుడు ఉంటాడని అన్నారు.