: హెచ్‌సీఏపై అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) పై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మండిపడ్డారు. హెచ్ సీఏ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని... ఆ ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే హెచ్ సీఏ సెలెక్షన్ కమిటీకి ఎలాంటి అర్హత లేదని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ సీఏలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్నారు. హెచ్ సీఏ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి సమయం పడుతుందని... తీర్పు వచ్చాక ఏం చేయాలో చెబుతానని తెలిపారు. 

  • Loading...

More Telugu News