: తల్లిదండ్రులు లేని ఈ బిడ్డలపైన వైసీపీ ప్రతాపం చూపిస్తోంది: నంద్యాలలో చంద్రబాబు
ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ రోజు నంద్యాలలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ వైసీపీ తీరుపై మండిపడ్డారు. తాము అవినీతి లేని పరిపాలనను కొనసాగిస్తున్నామని చంద్రబాబు అన్నారు. అందరికీ న్యాయం జరగాలనేదే తన ధ్యేయమని అన్నారు. మంచిని ప్రోత్సహించాలని, మంచిని పెంచాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులు లేని బిడ్డలపై (భూమా నాగిరెడ్డి బిడ్డలపై) వైసీపీ ప్రతాపం చూపిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు.
అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఆ అసెంబ్లీ నియోజక వర్గాన్ని విజయమ్మకు తాను వదిలిపెట్టానని చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ భూమా నాగిరెడ్డి చనిపోతే ఆ అసెంబ్లీ స్థానాన్ని ఆయన బిడ్డలకు వైసీపీ వదిలిపెట్టలేదని అన్నారు. తాను మొదటిసారి ఇటువంటి ఓ ప్రతిపక్ష నాయకుడిని చూస్తున్నానని అన్నారు.