: తన ప్రవర్తనపై ఫిర్యాదు చేసిందని జిమ్‌లో యువతిపై దాడి చేసిన వ్యక్తి ... వీడియో చూడండి!
తన ప్రవర్తన గురించి ఫిర్యాదు చేసిందన్న నెపంతో జిమ్‌లో వర్కవుట్లు చేసుకుంటున్న యువతిపై ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటన ఇండోర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జిమ్ మీడియాకు అందజేసింది. ఆ వ్యక్తి యువతిని తల మీద గట్టిగా కొట్టిన తర్వాత జిమ్‌లో ఉన్న ఇతర వ్యక్తులు వచ్చి ఆపుతున్నా ఆగకుండా యువతి మోకాలిపై గట్టిగా తన్నడం వీడియోలో చూడొచ్చు. దీంతో మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి కొడుతున్న వ్యక్తిని వెనక్కి లాగడం కనిపిస్తుంది. ఈ ఘటనలో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారా? లేదా? అనే విషయం ఇంకా తెలియరాలేదు.