surya: సూర్య, జ్యోతికల సినిమా వచ్చేస్తోంది!

సూర్య తన సొంత బ్యానర్లో జ్యోతిక ప్రధాన పాత్రగా ఒక సినిమాను నిర్మించాడు. ఆ సినిమా పేరే .. 'మగళిర్ మట్టుమ్'. మహిళా ప్రాధాన్యత కలిగిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో జ్యోతిక ఆదర్శవంతమైన పాత్రను పోషించింది. దర్శకుడిగా 'బ్రహ్మ' వ్యవహరించిన ఈ సినిమాలో జ్యోతికతో పాటు, భానుప్రియ .. శరణ్య .. ఊర్వశి ప్రధానమైన పాత్రలను పోషించారు.

 ఈ సినిమాలో జ్యోతిక తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. నిజానికి ఈ సినిమాను జూలైలోనే విడుదల చేయాలనుకున్నారుగానీ .. కుదరలేదు. దాంతో ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సూర్య - జ్యోతిక ఉన్నారట. ఇక వీళ్లిద్దరూ మళ్లీ కలిసి నటించే సమయం ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

More Telugu News