: ప్ర‌భాస్ `సాహో`లో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు!


ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం `సాహో` సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టి `శ్ర‌ద్ధ క‌పూర్‌` న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. `సాహో` బృందంలో భాగ‌మ‌వుతున్నందుకు సంతోషంగా ఉంద‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో జాకీ అన్నారు. గ‌తంలో కొన్ని తెలుగు సినిమాల్లో జాకీ ష్రాఫ్ విల‌న్‌గా క‌నిపించారు. త‌మిళ‌, తెలుగు, హిందీ మూడు భాష‌ల్లో వ‌స్తున్న ఈ చిత్రంలో ఇప్ప‌టికే నీల్ నితిన్ ముకేష్, చంకీ పాండేలు న‌టించ‌నున్నారు. శంక‌ర్ - ఎహ‌సాన్ - లాయ్‌లు స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. `బాహుబ‌లి` చిత్రాల‌తో ప్ర‌భాస్‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డ‌టంతో ఈ సినిమా కోసం ఎక్కువ‌గా బాలీవుడ్ వ‌ర్గాన్ని దింపేందుకే నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News