: సింగిల్ చపాతీ తినే చంద్రబాబుకు పాంట్రీకారు అవసరమా?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ నేతలు డబ్బును వెదజల్లుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. డబ్బు తరలిస్తున్నారనే అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీ చేయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. గాజులపల్లెమెట్ట వద్ద చంద్రబాబు పాంట్రీకారునే తనిఖీ చేశారని... కారు, బస్సులు వదిలేశారని అన్నారు. రోజుకు ఒక చపాతీ మాత్రమే తినే చంద్రబాబుకు పాంట్రీకారు అవసరమా? అని ఎద్దేవా చేశారు. కేబినెట్లోకి ఒక్క ముస్లింను కూడా తీసుకోని చంద్రబాబు... నంద్యాల ముస్లింలకు ఏదో చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీడీపీ నేతలు నోట్ల కట్టలను కుమ్మరించినా... అంతిమ విజయం వైసీపీదేనని చెప్పారు.