: యూట్యూబ్ దుమ్ముదులుపుతున్న బాలకృష్ణ కొత్త సినిమా ట్రైలర్!
పూరీ జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ‘పైసా వసూల్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మొన్న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తోంది. ఈ ట్రైలర్ నాలుగు గంటల్లో మిలియన్ వ్యూస్ సాధించిందని, 15 గంటల్లో రెండు మిలియన్ల వ్యూస్ పొందిందని, 25 గంటల్లో మూడు మిలియన్ల వ్యూస్ రాబట్టిందని భవ్య క్రియేషన్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ ట్రైలర్లో పూరీ మార్క్ సీన్లను, బాలయ్య చెబుతున్న డైలాగులను, చేస్తోన్న డ్యాన్స్ ను చూపించారు. ఈ సినిమా వచ్చేనెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.