: సీఈఓ రాజీనామా చేసిన‌ మ‌రుస‌టి రోజే షేర్ల బైబ్యాక్ ప్ర‌క‌టించిన ఇన్ఫోసిస్‌


దేశీయ రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నుంచి సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా చేసిన‌ మ‌రుస‌టి రోజే రూ. 13వేల కోట్ల విలువైన‌ షేర్ల బైబ్యాక్ చేప‌డుతున్న‌ట్లుగా కంపెనీ ప్ర‌క‌టించింది. ఇన్ఫోసిస్ ముఫ్పై ఆరేళ్ల చర్రితలో షేర్ల బైబ్యాక్ ప్ర‌క‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ షేర్ల‌లో ఒక్కో షేరును రూ.1,150 ధరకు కొనుగోలు చేస్తామని పేర్కొంది. శనివారం నాటి మార్కెట్‌లో ఇన్ఫోసిస్ షేర్ ముగింపు ధర రూ. 932కు 25శాతం ప్రీమియం క‌లుపుతూ షేర్ల బైబ్యాక్ చేస్తామ‌ని తెలిపింది.

వాటాదార్లకిచ్చిన షేర్లను తిరిగి వారి నుంచే కంపెనీ కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్‌ అంటారు. ఇటీవ‌లే ఇత‌ర ఐటీ కంపెనీలైన టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌లు కూడా త‌మ షేర్ల బైబ్యాక్ విలువ‌ను వెల్ల‌డించాయి. వీటిలో ఎక్కువ‌గా టీసీఎస్‌ రూ. 16 వేల కోట్ల మెగా బైబ్యాక్‌ను ఆఫర్ చేసింది. అలాగే విప్రో రూ. 2500 కోట్లతో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ. 3,500కోట్లతో షేర్ల‌ బైబ్యాక్‌ ప్రకటించాయి.

  • Loading...

More Telugu News