: ట్రంప్ ట్విట్టర్ ను వీడితే ట్విట్టర్ కు ఎన్ని వేల కోట్ల నష్టమో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో ఆయనకు సుమారు 36 మిలియన్ల (3 కోట్ల 60 లక్షల) మంది ఫాలోయర్లు ఉన్నారు. దీంతో ఆయన ఏది చెప్పాలనుకున్నా, ఎవరిని విమర్శించాలనుకున్నా తన ట్విట్టర్ ఖాతాను మాధ్యమంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో 2009లో ట్విట్టర్ లో చేరిన ఆయన ఇప్పటి వరకు దాదాపు 35,000 ట్వీట్లు చేశారు.
ఈ క్రమంలో ట్రంప్ ట్విట్టర్ ను వాడడం మానేస్తే ఆయనకు వచ్చే వ్యక్తిగత నష్టం సంగతి పక్కనుంచితే, ట్విట్టర్ కు మాత్రం భారీ నష్టం సంభవించనుందని మాన్సేస్ క్రిస్పీ హార్డ్ అండ్ కో విశ్లేషకుడు జేమ్స్ కేక్ మాన్ అన్నారు. ట్రంప్ ట్విట్టర్ వినియోగించడం మానేస్తే...ట్విట్టర్ 12 వేల 800 కోట్ల రూపాయలను షేర్ మార్కెట్లలో కోల్పోనుందని ఆయన అన్నారు. దీనిని బట్టి ట్విట్టర్ లో ట్రంప్ ఫాలోయింగ్, దానితో పాటు ముడిపడిన వ్యాపారం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.