: ఫ్రీజ‌ర్‌లో దాక్కుని ఉగ్ర‌దాడి గురించి లైవ్ ట్వీట్ చేసిన భార‌త సంతతి టీవీ న‌టి


బార్సిలోనా ఉగ్ర‌దాడి జ‌రుగుతుండ‌గా రెస్టారెంట్‌లోని ఫ్రీజ‌ర్‌లో దాక్కుని దాడికి సంబంధించి లైవ్ ట్వీట్లు చేసింది భార‌త మూలాలున్న టీవీ న‌టి. లండ‌న్‌కు చెందిన లైలా రోస్ త‌న హాలీడే గ‌డ‌ప‌డానికి ప‌దేళ్ల కూతురు ఇనేజ్ ఖాన్‌తో క‌లిసి బార్సిలోనా వెళ్లింది. ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్లో ఆమె సేద తీరుతుండ‌గా, అక్క‌డి సిబ్బంది అతిథులంద‌రినీ దాక్కోమ‌ని చెప్ప‌డంతో లైలా ఫ్రీజ‌ర్ రూంలోకి వెళ్లింది. అక్క‌డి నుంచి త‌న‌కు వినిపిస్తున్న తుపాకుల శ‌బ్దాలు, పోలీసుల అడుగుల చ‌ప్పుళ్ల‌ను ఆమె ట్వీట్ చేసింది. ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగాక ఫ్రీజ‌ర్ నుంచి బ‌య‌టికొచ్చిన ఆమె ఆ ప్రాంతంలోని ప‌రిస్థితిని వీడియో తీసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. లైలా తండ్రి మొరాకో దేశ‌స్థుడు, త‌ల్లి భార‌తీయురాలు. బ్రిట‌న్‌కు చెందిన టీవీ షోల్లో లైలా న‌టిస్తుంది. `ఫుట్‌బాల‌ర్స్‌`, `వైవ్స్‌`, `హోల్బీ సిటీ` వంటి టీవీ షోల్లో లైలా న‌టించింది. ఉగ్ర‌దాడి స‌మ‌యంలో త‌మ‌కు దాక్కోవ‌డానికి చోటు చూపించినందుకు లైలా హోట‌ల్ సిబ్బందికి, నిర్వాహ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

  • Loading...

More Telugu News