: ఆ చానల్ ఎవరిది? పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్?: జగన్ పై కమెడియన్ వేణుమాధవ్ తీవ్ర వ్యాఖ్యలు


నంద్యాల ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు పక్కనే ఉన్న సినీ కమెడియన్ వేణుమాధవ్ ప్రసంగిస్తూ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒకడేమో నాకు చానల్ లేదు, పేపర్ లేదని అంటున్నాడని... మరి ఆ చానల్ ఎవరిది, పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్? అంటూ తీవ్ర పదజాలంతో ప్రశ్నించాడు. తాను ఎవరినీ విమర్శించనని, విమర్శించే అలవాటు తనకు లేదని చెప్పాడు.

 "నా బిడ్డలైన భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల గురించి విమర్శించిన వారి గురించి నేను మాట్లాడటమా... థూ... నీచం, నికృష్టం" అని అన్నాడు. కర్నూలు నుంచి నంద్యాలకు ఒక గంటలో వచ్చేస్తానని అనుకున్నానని కానీ చాలా సమయం పట్టిందని... అన్ని చోట్లా అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతున్నాయని... ఎక్కడ చూసినా ప్రొక్లైనర్లే కనిపిస్తున్నాయని చెప్పాడు. కొంత మంది గుర్తు పట్టుకుని తిరుగుతున్నారని... మన గుర్తు మాత్రం మన గుండెల్లోనే ఉందని తెలిపాడు. కొంత మందికి పార్టీ గుర్తు ఏందో గుర్తులేక గుర్తు పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశాడు. చంద్రబాబుని నంద్యాల ప్రచారానికి రావద్దని తాను కోరానని... ఇక్కడ గెలుపు ఖాయమని, మీరు అక్కడే కూర్చుని టీవీల్లో చూడమని చెప్పానని అన్నాడు. నంద్యాలలో ఎంత మెజార్టీ వస్తుందో ప్రత్యక్షంగా చూడటానికే ఆయన వచ్చారని తెలిపారు. 

  • Loading...

More Telugu News