: విజయవాడ కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం!


మరో వ్యభిచార ముఠా గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేశారు. నివాసాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సత్యనారాయణపురం పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నిర్వాహకులు అన్నపూర్ణ, రామకృష్ణలతో పాటు నలుగురు అమ్మాయిలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ ఇల్లు ఓ స్థానిక కార్పొరేటర్ ది అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. మూడు నెలల క్రితమే సదరు కార్పొరేటర్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఆయనకు అనేక ఇళ్లు ఉన్నాయని పోలీసు దర్యాప్తులో తేలింది. అయితే, రియలెస్టేట్ వ్యాపారం చేస్తామంటేనే తాము వారికి ఇంటిని అద్దెకిచ్చినట్టు చెబుతున్నారు. ఇళ్లను అద్దెకు ఇవ్వడానికి, అద్దె వసూలు చేయడానికి సదరు కార్పొరేటర్ ఓ గుమాస్తాను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News