: ఉత్తరకొరియాను చైనాతోనే అదుపు చేయాలి..భారత్ సహకారం తీసుకుందాం: అమెరికా, జపాన్ నిర్ణయం


ఉత్తరకొరియాతో పొంచి ఉన్న ముప్పుపై అమెరికా, జపాన్ దేశాల ప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించారు. వాషింగ్టన్ లో జరిగిన ఈ సమావేశంలో ఉత్తరకొరియాను చైనా సహకారంతో అదుపు చేయాలని నిర్ణయించారు. అయితే అదొక్కటే ఉత్తరకొరియాను అదుపుచేసేందుకు సరిపోదని భావించిన ఆ రెండు దేశాలు ఉత్తరకొరియాను నియంత్రించాలంటే దక్షిణ కొరియా, భారత్, ఆస్ట్రేలియా దేశాల భద్రతా పరమైన సాయం తీసుకోవాలని నిర్ణయించాయి. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాయి.  

  • Loading...

More Telugu News