: 18 అడుగుల సొరంగం తవ్విన ఖైదీలు


అహ్మదాబాదులో ఉన్న సబర్మతీ జైలులో 18 అడుగుల సొరంగాన్ని అధికారులు గుర్తించారు. జైలులో ఖైదీలుగా ఉన్న 14 మంది నాలుగు అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్వినట్లు అధికారులు తెలిపారు. ఖైదీలలో కొందరు సివిల్ ఇంజినీర్లు కూడా ఉన్నారు.

భోజనానికి ఇచ్చిన ప్లేట్లు, గిన్నెలను ఉపయోగించి ఖైదీలు ఈ సొరంగాన్ని తవ్వారు. తోటపని చేసే ఈ ఖైదీలు సొరంగం కోసం తవ్విన మట్టిని తోటలో పారబోసేవారని జైలు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News