: అఖిల్ సినిమా ఫస్ట్‌లుక్ ఇదిగో!
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. విడుదలకు ముందే ఈ ఫస్ట్‌లుక్ ఆన్‌లైన్‌లో లీకవడంతో అఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా షేర్ చేశాడు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 21న తెలియజేస్తామని అఖిల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఓ పక్క హీరోయిన్ ముద్దు పెడుతుండగా, మరో పక్క గూండాలను కాలితో కిక్ కొడుతున్నట్లు ఉన్న ఈ ఫస్ట్‌లుక్ స్టిల్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. `13బి`, `24`, `మనం` వంటి సినిమాలు తీసిన విక్రమ్ కె. కుమార్ ఈ చిత్రం ద్వారా ఏదో కొత్త విషయం చెప్పనున్నాడని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగార్జున కూడా ఈ స్టిల్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు