: మమ్ముట్టి, మోహన్ లాల్ లపై రామ్ గోపాల్ వర్మ కామెంట్!


ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లను టార్గెట్ చేశాడు. కేరళలో సన్నీలియోన్ కు వచ్చిన ప్రజాస్పందనను చూసి వీరిద్దరూ అసూయతో ఏడుస్తారని ఫేస్ బుక్ ద్వారా కామెంట్ చేశాడు. ఓ కార్యక్రమానికి సంబంధించి సన్నీలియోన్ ఇటీవల కేరళకు వెళ్లింది.

ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అక్కడి జనాలు ఎగబడ్డారు. ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన అభిమానులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలోనే వర్మ సోషల్ మీడియాలో స్పందించాడు. సన్నీలియోన్ కు వచ్చినంత స్పందన గతంలో ఎన్నడూ మమ్ముట్టి, మోహన్ లాల్ లకు రాలేదని ఆయన తెలిపాడు. కేరళ ప్రజల సహృదయానికి, ఆదరించే స్వభావానికి శాల్యూట్ చేస్తున్నానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News