: 'గంట టైమ్ ఇస్తున్నా... యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కాపాడుకోండి' అంటూ ఆగంతుకుడి ఫోన్ కాల్!


ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను హతమారుస్తానంటూ ఆగంతుకుడు ఫోన్ చేయడం కలకలం రేపుతోంది. ఢిల్లీలోని పోలీస్ కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నంబర్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని, పోలీసులకు గంట సమయం ఇస్తున్నామని, ఆయనను రక్షించుకోవాలని సూచించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది సదరు ఫోన్ నెంబర్ ను గుర్తించే ప్రయత్నం చేయగా, దానిని వాయిస్ ఇంటర్నెట్ కాల్ గా గుర్తించారు. దీంతో ఫోన్ చేసిన ఆగంతుకుడెవరో గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను యూపీ యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ (ఏటీఎస్) కు అప్పగించారు. దీనిని ఛేదిస్తామని ఏటీఎస్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News