: ఏపీ సచివాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో మృతి!
గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన విపరీతంగా అప్పులు చేయడంతో వాటిని తీర్చాలంటూ ఒత్తిళ్లు, వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తన బాధను చెప్పుకుందామని అమరావతి చేరాడు. అయితే ఆయన అపాయింట్ మెంట్ లభించకపోవడంతో మనస్తాపం చెందిన రాజగోపాల్ వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన సచివాలయ సిబ్బంది హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.