: దక్షిణ కొరియాకు అధ్యక్షుడు మూన్ జే ఇన్ కాదు... డొనాల్డ్ ట్రంప్!: ఉత్తరకొరియా వ్యంగ్యం


దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ అయితే, డొనాల్డ్ ట్రంప్ అంటున్నారేమిటి? అన్న అనుమానం వచ్చిందా? దీనికి ఓ కారణముంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తరకొరియా మీడియా అతనిపై ఓ కథనం ప్రసారం చేసింది. అందులో అమెరికాకు తొత్తుగా వ్యవహరించడంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వందశాతం ఉత్తీర్ణులయ్యారని ఎద్దేవా చేసింది.

దక్షిణకొరియా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడంలో, ట్రంప్ కు భజన చేయడంలో మూన్ ముందున్నారని ఎద్దేవా చేసింది. మూన్ తీరు వల్ల కొరియా ద్వీపకల్పంలో అశాంతి రేగుతోందని ఆ కథనం తెలిపింది. ఉత్తరకొరియా, దక్షిణ కొరియా మధ్య శాంతి నెలకొనాలంటే ఆ దేశం అమెరికాకు వంతపాడడం మానెయ్యాలని అన్నారు. మూన్ జే ఇన్ ను దక్షిణకొరియా అధ్యక్షుడిగా ఆదేశ ప్రజలు కానీ, తాము కానీ భావించడం లేదని, దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆ కథనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

  • Loading...

More Telugu News