: తలకు వెల... త్రిపుర ముఖ్యమంత్రి తలను తీసుకొస్తే 5.5 లక్షలిస్తా!: ఫేస్ బుక్ లో ఫత్వా


త్రిపుర సీఎం తలకు వెలకడుతూ ఓ దుండగుడు ఫేస్ బుక్ లో ఫత్వా జారీ చేశాడు. తనను తాను వామపక్ష వ్యతిరేక మండలి కార్యకర్తగా పేర్కొన్న ఆ వ్యక్తి... త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తలను తెచ్చిన వ్యక్తికి 5.5 లక్షల రూపాయలు ఇస్తానంటూ ఫేస్ బుక్ లో ఫత్వా జారీ చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఇండోర్ నుంచి ఈ పోస్టు పెట్టినట్టు గుర్తించారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. 

  • Loading...

More Telugu News